అనంత యాత్ర

బహెన్ జీ శ్రీ బాబూజీ మహారాజ్ ను కలిసి నప్పటి నుండి ఆమె ఆధ్యాత్మిక యాత్ర ఆయన మార్గ దర్శకత్వం లో కొన సాగింది . ఆయన, మానవాళి దివ్య వికాసం కొరకు, ప్రకృతి కోరిక మేరకు అవతరించిన విశిష్ట మూర్తి మత్వము (స్పెషల్ పర్సనాలిటి ) అనే సత్యమును బహెన్ జీ అతి త్వరలోనే గ్రహించినారు. 1949 నవంబరు 7 వ తేదిన శ్రీ బాబూజీ మహరాజ్, అభ్యాసులను ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో తీసుకొని వెళ్లుటకు కస్తూరీ బహెన్ జీ ని ప్రిసెప్టర్ గా నియమించినారు. అప్పటి నుండి ఆమె సమస్తము శ్రీ బాబూజీ కీ అర్పణ చేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వ హించినారు . ఆమె ప్రకృతి కార్య నిర్వహణలో పాలు పంచు కుంటూ శ్రీ బాబూజీ అప్పగించిన అనేక కర్తవ్యాలను పూర్తి చేసారు. 1953 అక్టోబర్ 27 వ తేదిన శ్రీ బాబూజీ మహరాజ్ బహెన్ జీకి సెయింట్ ( సంత్ – గతి ) అనే ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించినారు. అప్పటి నుండి శ్రీ బాపూజీ బహెన్ జీ గురించి ఎవరితోనయినా చెప్పవలిసి వస్తే “సెయింట్ కస్తూరీ ” అని చెప్పేవారు.

1955 అగుష్టు 29 న , నీవు నాలో లయం అయినావు , ఇక నీవు నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు చెందిన కస్తూరివి కాదు, అని శ్రీ బాబూజీ ఆమెకు వ్రాసినారు. 1964 సెప్టెంబరు 15 న శ్రీ బాబూజీ , బిటియా నీవు భగవంతుని స్థితిని పొందినావు, అని తెలిపినారు. 1967 సెప్టెంబరు 15 న ఆమె సెంట్రల్ రీజియన్ (కేంద్ర మండలం) లో ప్రవేశించినారు. 1968 జూన్ 28 న ఆమె బ్లిస్స్ (పరమానంద స్థితి ) లో ప్రవేశించి నారు. 1975 మే 2 న బహెన్ జీ , శ్రీ బాబూజీకి, నన్ను ఎవరో అనంత సాగరాన్ని దాటించి నట్లుగా వుంది. అని లేఖ రూపం లో నివేదించినారు.

.

శ్రీ బాబూజీ మహరాజ్ తమ రిసెర్చి(ఆధ్యాత్మిక పరిశోధన ) ను సెయింట్ కస్తూరీ బహెన్ జీ మీద చేసి, ఆమె అనుభవాలను, అనుభూతులను ఆధ్యాత్మిక మార్గదర్శకానికి, ప్రగతి కోసం పుస్తక రూపం లో ప్రచురణ చేయమని కోరినారు . అప్పటి నుండి ఆమె కలం నిరంతరం వ్రాస్తూనే వుంది. ఆమె మధుర స్వరం నుండి వెలువడిన భక్తి గీతాలు ప్రాణాహుతితోనూ, ఆధ్యాత్మిక స్థితులతోను నిండి దివ్య ప్రకంపనలను ప్రసారం చేస్తాయి. ఆమె వ్రాసిన గీతాలను అన్నింటిన “సంధ్యాకే గీత్” పీరుతో రెండు భాగాలుగా, ఆమె ఆధ్యాత్మిక అనుభవాలను సంకలన పరచి, అనుభవ సరిత అనే పుస్తక రూపంలోను ప్రచురించినారు.

కస్తూరి బహెన్ జీ తన జీవిత కాలమంతా అభ్యాసీల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గదర్శకత్వం వహిస్తూనే, వారి శిక్షణ కోసం ప్రశిక్షులను కూడా తయారు చేసినారు.

దాదాపుగా 63 సంవత్సరములుగా మానవాళికి నిర్విరామముగా సేవ చేస్తూ సెయింట్ కస్తూరీ బహెన్ జీ 22 ఫిబ్రవరిన 2012 న లక్నోలో మహాసమాధిని పొందినారు.

బహెన్ జీ భౌతికంగా మన మధ్యలో వున్నా ఆమె ఆ దివ్య దేశం లోనే జీవించే వారు . ఆమెను చూచిన వారికి ,బహెన్ జీ, శ్రీ బాబూజీ యొక్క ప్రతిబింబమా అనే భావన కలిగేది. డివైన్ పర్సనాలిటీ దివ్య పురుషుడు శ్రీ బాబూజీ మహరాజ్ యొక్క పియాతి ప్రియమైన ఆధ్యాత్మిక పుత్రిక అయిన సెయింట్ కస్తూరీ బహెన్ జీ, హరి ఆధ్యాత్మిక దివ్య సంపదను మానవాళికి పంచడానికే నిరంతరం కృషి చేసినారు, ఇంకా చేస్తూనే వుంటారు.