హోం పేజి

సెయింట్ సోదరి కస్తూరి

సెయింట్ సోదరి కస్తూరి తన జీవితాన్నంత దివ్య పురుషులు శ్రీ బాబూజీ మహారాజ్( ఫాజహాన్ పూర్ ) సేవలోనే గడిపారు. సోదరి చేపట్టిన ప్రతి పనిలో అంటే ఉపన్యాసాలు ఇస్తున్నపుడు, సత్సంగము జరుపుతున్నపుడు, స్వరపరచిన గీతాలు ఆలపించేటపుడు, బాబూజీ మహారాజ్ కు సంబంధించిన పనులన్నింటిలో నిమగ్నమై ఉన్నపుడు వారి దివ్యత్వం సోదరి ద్వారా ప్రవహించేది.

దివ్య ప్రేమకు, భక్తికి మన ప్రియతమ సోదరి ఒక సజీవ ఉదాహరణ వారి ఆధ్యాత్మిక గురువు శ్రీ బాబూజీ మహారాజ్ కు సంపూర్ణంగ సమర్పితమై, వారిలోనే లయమై జీవించారు. సోదరి కస్తూరి తనలో లయమయ్యారని శ్రీ బాబూజీ మహరాజే స్వయంగ ప్రకటించారు. అందరూ ప్రేమతో వారిని ‘సోదరి’ అని, ‘జిజ్జి’ అని పిలిచేవారు. అంటే అందరికి వారు తోబుట్టువు అయి దివ్య ప్రేమను పంచడములో మాతృమూర్తిని కూడా మించిపోయారు.