సోదరి గురించి

 క్లుప్తంగా జీవిత చరిత్ర

సెయింట్ కస్తూరి బహెన్ జీ 1926 సంవత్సరము సెప్టెంబర్ 26 తేదీన లఖింపూర్ ఖేరి (ఉత్తర ప్రదేశ్) నందు శ్రీ పండిట్ రాందాస్ చతుర్వేది, శ్రీమతి భగవతిదేవి పుణ్యదంపతులకు జన్మించారు.

కస్తూరి బహెన్ జీ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమును 1945 సంవత్సరములో పూర్తిచేసినారు. ఆమె చిన్న తనం నుండే సెయింట్ (సంత్) గుణాలతో భాసిల్లేవారు .

కస్తూరి బహెన్ జీ తండ్రిగారు మిగితా కుటుంబ సభ్యులు అందరు కూడ భగవదారాధకులు , భక్తి తత్పరులు. సంత్ లు , ఫకీర్లు తరచుగా వారి గృహానికి వచ్చి వెళ్లుతూ వుండేవారు. ఆమె తండ్రి గారు అయిన శ్రీ పండిట్ రాందాస్ చతుర్వేది గారు చాలా భక్తి, శ్రద్ధలతో ఆ సత్సంగాలలో పాల్గొనేవారు. ఆయన దానశీలి మరియు అందరికి కష్టములలో చాలా సహాయము చేసేవారు. పేద విధ్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఇచ్చి పాఠశాల ఫీజులను కట్టి, వారికి సహాయపడేవారు. వారి కుటుంబ సభ్యులు అందరు కూడ దైవ వర ప్రసాదితమైన సంగీతము, గాత్రము, రచనలో నిష్ణాతులు. వారందరు కూడ తరచు సాయంత్రం జరిగే భక్తి పూర్వకమయిన భజనలు, కీర్తనలు, గానములో పాల్గొని పరవశించేవారు.

దివ్య దర్శనము

స్పెషల్ పర్సనాలిటీ(విశిష్ట మూర్తి మత్వము ) అయిన శ్రీ బాబూజీ మహరాజ్ శుభ దర్శనానికి పూర్వమే బహెన్ జీ కి ఒక దివ్య సంఘటన అనుభవమయినది. 1948 సంవత్సరవము జనవరి నెలలో ఒక సాయంత్రము ఆమె ఆలోచనారహిత స్థితిలో ఆకాశాన్ని వీక్షిస్తున్నారు, హఠాత్తుగా ఒక కాంతి విస్తరిస్తూ వుండడము, ఆ ప్రకాశం మధ్యలో భగవాన్ శ్రీ రాముని రూపాన్ని ఆమె గమనించారు. కొద్ది సేపటికి ఆ రూపము అదృశ్యమై భగవాన్ శ్రీ కృష్ణుని రూపము ప్రత్యక్షమయినది. తరువాత అది కూడ మాయమై ఓం ప్రత్యక్షమయినది, కొంత సేపటికి అది కూడ అంతర్ధానమై, ఆ ప్రకాశంలో, సుకుమారమయిన రూపంతో అందమయిన, తెల్లని గడ్గం తో, ప్రకాశవంతమయిన మహా పురుషుడు దివ్య తేజస్సును విరజిమ్ముతూ కనిపించారు. ఎంతసేపు ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉండిపోయారో, మైమరచి పోయిన ఆమెకు తెలియలేదు. కానీ కొంతసేపటికి హఠాత్తుగా ఆమె, ఆకాశం మాములుగా ఉండడము గమనించారు. అప్పటినుండి కస్తూరి బహెన్ జీ అంతరంగం ఆమెకు తెలియకుండానే ఆ దివ్య రూపం కొరకు వెదుకుతూ నిరిక్షించ సాగినది.

ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చినది . అందులో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కాళికాదేవి ఆలయం ముఖ ద్వారం ముందు నిలబడి వున్నారు. ద్వారం దగ్గర అందమయిన గడ్గం తో ఒక దివ్య పురుషుడు నిర్మల ప్రశాంతతో నిలబడి వున్నారు. ఆ మహాపురుషుడు ఆమెకు ఒక ఖడ్గమును అందించినారు. ఆలయం లోనికి ప్రవేశించాలంటే ఆ ఖడ్గం తో ఆమె తన తలను ఖండించి, ఆ మహాత్ముని చేతికి ఇవ్వాలనే నిభందనను విధించినారు. వెంటనే మరియొక ఆలోచన లేకుండా, సోదరి కస్తూరీ, తన తలను ఖండించి ఆ మహాపురుషుని చేతిలో వుంచి, ఆలయం లోనికి ప్రవేశించినది. కానీ అక్కడ ఎటువంటి విగ్రహము లేదు. ఒక ప్రశాంతమయిన వాతావరణము నెలకొని వున్నది. ఆమె స్థితి కుడా దివ్యత్వంతో నిండి వున్నది. కల అంతటితో అంతమయినది. కానీ ఆ దృశ్యము నిద్ర లేచిన తరువాత కూడ ఆమె స్మృతి పధం నుండి తొలగిపోలేదు.

తరువాత రోజు అంటే 1948 సంవత్సరము జనవరి ౩ వ తారీఖు సాయంత్రము బహెన్ జీ జీవితంలో అత్యంత ఆశ్చర్య కరమయిన సంఘటన జరిగినది. పూజ్య శ్రీ బాబూజీ మహరాజ్ వారి గృహమునకు విచ్చేసినారు. శ్రీ బాబూజీని చూసి ఆమె ఆశ్చర్య చకిత అయినారు. ఎందుకంటే ఆయనే అంతకు ముందు రోజు ఆకాశం లో దర్శనం ఇచ్చిన దివ్య పురుషుడు. పరిపూర్ణ మార్గదర్శి కోసం ఆమె నిరీక్షణ ఫలించినది. ఆశ్చర్య, అనురాగాలతో బహెన్ జీ , “ఓ బాబూజీ ! ఇంతకాలం నేను మీ గురించే వెదుకుతున్నాను” అని అన్నారు. దానికి బాబూజీ, ” బిటియా నేను కూడ నీ గురించే వెదుకుచున్నాను. ఇప్పటికి నీవు కనిపించినావు” అని అన్నారు. ఈ విధంగా మొదటి సారి కస్తూరి బహెన్ జీ, శ్రీ బాబూజీ మహరాజ్ ను ఆమె ఇంటి దగ్గర కలుసుకొన్నప్పుడు దివ్య ధారా ప్రవాహం సంభాషణ రూపంగా మొదలయినది.

సాధారణముగా శిష్యుడు గురువును వెదుకుతూ ఆయనను చేరుతాడు . కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రము సద్గురువే స్వయంగా తన ప్రియ శిశ్యుని గురించి, శిశ్యుని గృహానికి వెల్లడమనేది చాలా అరుదుగా సంభవిస్తుంది. ఈ విధంగా 1948 సంవత్స రము నుండి ఆమె ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమయినది. బహెన్ జీ తన ఆధ్యాత్మిక అనుభవాలను వ్రాసుకొని వాటిని ఉత్తరాల ద్వార శ్రీ బాబూజీ కి తెలియ పరిచే వారు. శ్రీ బాబూజీ కూడ ఆమె ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమయిన సూచనలు చేస్తూ జవాబులు ఇచ్చెవారు . శ్రీ బాబూజీ మహరాజ్ మరియు కస్తూరీ బహెన్ జీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మానవాళికి వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద వాటిని “అనంతయాత్ర “ అనే పేరుతో 5 భాగాలుగా ప్రచురించినారు. బహెన్ జీ వ్రాసిన అన్ని గ్రంధాలు, రచనలు కూడ శ్రీ బాబూజీ మహరాజ్ ఆమెకు ప్రసాదించిన ఆధ్యాత్మిక దివ్య అనుభూతులు, స్థితులు మాత్రమే.

సంత్ గతి, ఆధ్యాత్మిక అనంత యాత్ర

బహెన్ జీ శ్రీ బాబూజీ మహారాజ్ ను కలిసి నప్పటి నుండి ఆమె ఆధ్యాత్మిక యాత్ర ఆయన మార్గ దర్శకత్వం లో కొన సాగింది . ఆయన, మానవాళి దివ్య వికాసం కొరకు, ప్రకృతి కోరిక మేరకు అవతరించిన విశిష్ట మూర్తి మత్వము (స్పెషల్ పర్సనాలిటి ) అనే సత్యమును బహెన్ జీ అతి త్వరలోనే గ్రహించినారు. 1949 నవంబరు 7 వ తేదిన శ్రీ బాబూజీ మహరాజ్, అభ్యాసులను ఆధ్యాత్మిక ప్రగతి మార్గంలో తీసుకొని వెళ్లుటకు కస్తూరీ బహెన్ జీ ని ప్రిసెప్టర్ గా నియమించినారు. అప్పటి నుండి ఆమె సమస్తము శ్రీ బాబూజీ కీ అర్పణ చేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వ హించినారు . ఆమె ప్రకృతి కార్య నిర్వహణలో పాలు పంచు కుంటూ శ్రీ బాబూజీ అప్పగించిన అనేక కర్తవ్యాలను పూర్తి చేసారు. 1953 అక్టోబర్ 27 వ తేదిన శ్రీ బాబూజీ మహరాజ్ బహెన్ జీకి సెయింట్ ( సంత్ – గతి ) అనే ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించినారు. అప్పటి నుండి శ్రీ బాపూజీ బహెన్ జీ గురించి ఎవరితోనయినా చెప్పవలిసి వస్తే “సెయింట్ కస్తూరీ ” అని చెప్పేవారు.

1955 అగుష్టు 29 న , నీవు నాలో లయం అయినావు , ఇక నీవు నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు చెందిన కస్తూరివి కాదు, అని శ్రీ బాబూజీ ఆమెకు వ్రాసినారు. 1964 సెప్టెంబరు 15 న శ్రీ బాబూజీ , బిటియా నీవు భగవంతుని స్థితిని పొందినావు, అని తెలిపినారు. 1967 సెప్టెంబరు 15 న ఆమె సెంట్రల్ రీజియన్ (కేంద్ర మండలం) లో ప్రవేశించినారు. 1968 జూన్ 28 న ఆమె బ్లిస్స్ (పరమానంద స్థితి ) లో ప్రవేశించి నారు. 1975 మే 2 న బహెన్ జీ , శ్రీ బాబూజీకి, నన్ను ఎవరో అనంత సాగరాన్ని దాటించి నట్లుగా వుంది. అని లేఖ రూపం లో నివేదించినారు.

శ్రీ బాబూజీ మహరాజ్ తమ రిసెర్చి(ఆధ్యాత్మిక పరిశోధన ) ను సెయింట్ కస్తూరీ బహెన్ జీ మీద చేసి, ఆమె అనుభవాలను, అనుభూతులను ఆధ్యాత్మిక మార్గదర్శకానికి, ప్రగతి కోసం పుస్తక రూపం లో ప్రచురణ చేయమని కోరినారు . అప్పటి నుండి ఆమె కలం నిరంతరం వ్రాస్తూనే వుంది. ఆమె మధుర స్వరం నుండి వెలువడిన భక్తి గీతాలు ప్రాణాహుతితోనూ, ఆధ్యాత్మిక స్థితులతోను నిండి దివ్య ప్రకంపనలను ప్రసారం చేస్తాయి. ఆమె వ్రాసిన గీతాలను అన్నింటిన ““సంధ్యాకే గీత్”” పీరుతో రెండు భాగాలుగా, ఆమె ఆధ్యాత్మిక అనుభవాలను సంకలన పరచి, అనుభవ సరిత అనే పుస్తక రూపంలోను ప్రచురించినారు.

కస్తూరి బహెన్ జీ తన జీవిత కాలమంతా అభ్యాసీల ఆధ్యాత్మిక ప్రగతికి మార్గదర్శకత్వం వహిస్తూనే, వారి శిక్షణ కోసం ప్రశిక్షులను కూడా తయారు చేసినారు.

దాదాపుగా 63 సంవత్సరములుగా మానవాళికి నిర్విరామముగా సేవ చేస్తూ సెయింట్ కస్తూరీ బహెన్ జీ 22 ఫిబ్రవరిన 2012 న లక్నోలో మహాసమాధిని పొందినారు.

బహెన్ జీ భౌతికంగా మన మధ్యలో వున్నా ఆమె ఆ దివ్య దేశం లోనే జీవించే వారు . ఆమెను చూచిన వారికి ,బహెన్ జీ, శ్రీ బాబూజీ యొక్క ప్రతిబింబమా అనే భావన కలిగేది. డివైన్ పర్సనాలిటీ దివ్య పురుషుడు శ్రీ బాబూజీ మహరాజ్ యొక్క ప్రియాతి ప్రియమైన ఆధ్యాత్మిక పుత్రిక అయిన సెయింట్ కస్తూరీ బహెన్ జీ, వారి ఆధ్యాత్మిక దివ్య సంపదను మానవాళికి పంచడానికే నిరంతరం కృషి చేసినారు, ఇంకా చేస్తూనే వుంటారు.

ఆమె ఒక గానంలో ఈవిధముగా చెప్పారు “ఓ బాబూజీ , జో తేరీ చరనోమే ఆ గయే , ఆధ్యాత్మ పాత్ మే జల్తీ వో మసాల్ పా గయే. ” అంటే ” ఓ బాబూజీ, మీ చెంతకు ఎవరైన చేరగా, వారికి ఆధాత్మికంలో కొనసాగిరి .” ఆమె వేరే ఒక గీతములో ఈ విధముగా చెప్పిరి .” ఆమె శరీరమందు ప్రతి అణువులో బాబుజీ గారి నామ స్మరమే వినపడును ”

“తన్ కి మతి సే మేరె వ్రిఛ్ జబ్ ఉగేగి కోయి,
పాతి పాతి మన్ తేరా నామ్ పడ్ సకేగా కోయి,
భక్తి కె రస్ సే సబ్కే మన్ పులక్ సే జాయేంగే”

కస్తూరీ గారి లయవస్థను ఈ విధముగా చెప్పగలము